మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ లాల్!
- మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'కన్నప్ప'
- సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా
- ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న ప్రభాస్
- కీలకమైన పాత్రను పోషించనున్న మోహన్ లాల్
హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో 'కన్నప్ప' సినిమా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు. మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కన్నప్ప టీమ్ న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ .. విజయేంద్ర ప్రసాద్ .. తోటపల్లి సాయినాథ్ .. తోట ప్రసాద్ .. నాగేశ్వర రెడ్డి .. ఈశ్వర్ రెడ్డి .. ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో కన్నప్ప మీద అంచనాలు పెంచబోతున్నారు.