శోభన్ బాబుగారికి నేనంటే చాలా ఇష్టం: నటి జయలలిత

Jayalalitha Interview
షార్ట్స్‌లో చూడండి
వై.విజయ తరువాత ఆ స్థాయి గ్లామరస్ పాత్రలలో మెరిసిన నటిగా జయలలిత కనిపిస్తుంది. ఒకానొక దశలో జయలలిత లేని సినిమా ఉండేది కాదు. అలాంటి జయలలిత తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నన్ను సిఫార్స్ చేసింది కమల్ గారే. అంతకుముందు ఆయనతో ఒక మలయాళ సినిమా చేశాను" అని అన్నారు. 

"శోభన్ బాబు గారితో 'దొరబాబు' అనే ఒక సినిమా చేశాను. అరకులో షూటింగు .. మాకు రైల్వే క్వార్టర్స్ లో బస ఏర్పాటు చేశారు. శోభన్ బాబు గారికి మాత్రం సెపరేటుగా గెస్టు హౌస్ ను కేటాయించారు. 'వాళ్లంతా ఉంటే సరదాగా ఉంటుంది .. నన్ను ఒక్కడిని తెచ్చి ఇక్కడ పడేశారేంటి .. వాళ్లనైనా ఇక్కడికి రమ్మనండి .. నన్నైనా అక్కడికి తీసుకుని వెళ్లండి' అంటూ ఆయన అలిగేవారు" అని చెప్పారు. 

"నేనంటే శోభన్ బాబుగారికి చాలా ఇష్టం .. నా పేరు కూడా జయలలిత కదా. 'ఆ అమ్మాయి నా లవర్ .. తనని ఎవరైనా ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు' అంటూ సరదాగా అనేవారు. ఆయన చేయకపోయినా .. ' ఎక్కడున్నావ్ జయా' అంటూ నాకు మెసేజ్ లు పెట్టేవారు. 'మీ ఇంటిముందే ఉన్నాను' అని నేను మెసేజ్ చేస్తే నమ్మేసి, బయటికి వాచ్ మెన్ ను పంపించేవారు. ఆయన మరణం నన్ను బాగా కదిలించి వేసింది .. అలాగే శరత్ బాబుగారి మరణం కూడా" అని అన్నారు. 

Go Back to Shorts
Jayalalitha
Actress
Sobhan Babu

More Telugu News