Junior NTR: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR returned from Dubai
షార్ట్స్‌లో చూడండి
సైమా-2023 సినిమా అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుక దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా దుబాయ్ కు వెళ్లాడు. ఆవార్డుల వేడుకలు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. నిన్న రాత్రి కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రాబాబు అరెస్టయిన తర్వాత ఆ అంశంపై తారక్ ఇంత వరకు స్పందించలేదు. దీంతో, ఆయనపై టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇండియాకు తిరిగొచ్చిన తారక్ దీనిపై ఏమైనా మాట్లాడతాడా? అని ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు చాలా కాలంగా తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. పూర్తి స్థాయిలో తన దృష్టిని సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నాడు.
Go Back to Shorts
Junior NTR
Tollywood
Dubai

More Telugu News