Advertisement

వాళ్లే నాకు చేయూత.. వాళ్లకు పాదాభివందనాలు: జూనియర్ ఎన్టీఆర్

Junior NTR says fans are everything for him
  • దుబాయ్ లో సైమా అవార్డుల వేడుకలు 
  • ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న తారక్
  • తన అభిమానులే తనకు సర్వస్వం అన్న యంగ్ టైగర్
దుబాయ్ లో సైమా అవార్డుల వేడుకలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లారు. నిన్న రాత్రి జరిగిన వేడుకల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను తారక్ ఉత్తమ నటుడి అవార్డును అండుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

 'నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్లు కూడా బాధ పడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్లు కూడా నవ్వినందుకు, నా అభిమాన సోదరులందరికి తల వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను' అని చెప్పాడు. 
Advertisement
Junior NTR
Tollywood

More Telugu News