ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు... పార్టీలోకి పలువురు నేతల క్యూ
- నేడు సోనియా సమక్షంలో తుమ్మల చేరిక
- ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి
- ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
- నిన్న పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య
మరోవైపు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.