చంద్రబాబునే ఏమీ చేయలేని బాలకృష్ణ... జగన్ ను ఏం చేస్తారు?: రోజా
- చంద్రబాబుది అడ్డంగా దొరికిపోయిన కేసు అన్న రోజా
- ప్యాకేజీ తీసుకున్న పవన్ తన అభిమానులను మోసం చేశారని విమర్శ
- జగన్ ను పవన్ ఏమీ చేయలేరని వ్యాఖ్య
చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కల్యాణ్... సీఎం జగన్ ను ఏం చేయగలరని ఎద్దేవా చేశారు. చంద్రబాబునే ఏమీ చేయలేని బాలకృష్ణ... జగన్ ను ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 24 గంటల్లోనే పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించారని విమర్శించారు.