ఈ వారం ఓటీటీ సినిమాలు .. సిరీస్ లు ఇవే!
- నెట్ ఫ్లిక్స్ లో 14వ తేదీన 'రామబాణం'
- 15వ తేదీన స్ట్రీమింగ్ కానున్న 'భోళా శంకర్'
- అదే రోజున 'ఆహా'లో పలకరించనున్న 'మాయా పేటిక'
- అమెజాన్ ప్రైమ్ లో 14న 'బంబై మేరీ జాన్'
- 15వ తేదీన హాట్ స్టార్ లో 'కాలా' సిరీస్
'ఆహా'లో 'మాయా పేటిక' సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. విరాజ్ అశ్విన్ .. పాయల్ .. సిమ్రత్ కౌర్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇదే రోజున 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్' అనే మలయాళ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ టీనేజ్ లవ్ స్టోరీకి మలయాళంలో థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇక ఈ నెల 14వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో 'బంబై మేరీ జాన్' సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 1960 నేపథ్యంలో నడిచే గ్యాంగ్ స్టర్ స్టోరీ ఇది. కేకే మీనన్ .. అవినాశ్ తివారి ప్రధానమైన పాత్రలను పోషించారు. 15వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో 'కాలా' వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.