'రూల్స్ రంజన్' న్యూ రిలీజ్ డేట్ ఇదే!
- కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'రూల్స్ రంజన్'
- ఆయన జోడీకట్టిన నేహా శెట్టి
- సంగీతాన్ని సమకూర్చిన అమ్రిశ్ గణేశ్
- అక్టోబర్ 6వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ తో అంచనాలు పెరుగుతూ వెళ్లాయి.
అమ్రిశ్ గణేశ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. కిరణ్ అబ్బవరం సినిమాలలో మంచి ఎంటర్టైన్ మెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఇక నేహా శెట్టికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.