Chandrababu: జైల్లో యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు.. ఈరోజు కుటుంబసభ్యులతో ములాఖత్

Chandrababu morning walk and yoga in jail
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన త్వరగా నిద్రపోయారు. ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆయన వాకింగ్, యోగా చేశారు. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత... ఆయన సహాయకుడు ఆయనకు అల్పాహారాన్ని అందించాడు. అనంతరం ఆయన మెడిసిన్స్ వేసుకున్నారు. 

ఈ రోజు తన కుటుంబసభ్యులతో చంద్రబాబు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక పత్రేక గదిని ఆయనకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jail

More Telugu News