చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేత కే లక్ష్మణ్ స్పందన

BJP Laxman responds on Chandrababu arrest
  • చంద్రబాబు అరెస్ట్ సరికాదన్న తెలంగాణ బీజేపీ నేత
  • ఎలాంటి వివరణ అడగకుండా ఎలా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్య
  • ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండా అరెస్ట్ చేయడం సరికాదన్న లక్ష్మణ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. ఎలాంటి వివరణ అడగకుండా టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండానే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ తప్పుబడుతోందన్నారు.

మరోవైపు, చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. హౌస్ రిమాండ్ కంటే చంద్రబాబుకు రాజమండ్రి కేంద్రకారాగారంలోనే భద్రత ఉంటుందని సీఐడీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగారు. చంద్రబాబుకు ముప్పు విషయంలో సంబంధిత అంశాలను లూథ్రా... న్యాయమూర్తికి వివరించారు.
Go Back to Shorts
k laxman
BJP
Telugudesam
Chandrababu

More Telugu News