Chandrababu: చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్

AP CID files custody petition for Chandrababu
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ ను కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. 

మరోవైపు, కోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.  

Go Back to Shorts
Chandrababu
Telugudesam
CID
Custody Petition

More Telugu News