చంద్రబాబుకు హెలికాప్టర్ ఆఫర్ చేశాం.. కానీ ఆయన నిరాకరించారు: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్
- నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
- చంద్రబాబు వయసును దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న అడిషనల్ డీజీ
- ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో లోకేశ్ ను విచారిస్తామని వెల్లడి
చంద్రబాబు వయసును, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంజయ్ చెప్పారు. ఇప్పటికే 50 శాతం ప్రయాణం పూర్తయిందని తెలిపారు. ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని... సాయంత్రం 6 లోగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా విచారిస్తామని తెలిపారు. ఈ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో కూడా లోకేశ్ ను లోతుగా విచారిస్తామని చెప్పారు.