ప్రియురాలిని పెళ్లాడిన సినీ హాస్య నటుడు మహేశ్ విట్టా

Comedian Mahesh Vitta marries his lover Sravani Reddy
  • ప్రేయసి శ్రావణి రెడ్డిని పెళ్లాడిన మహేశ్ విట్టా
  • కడప జిల్లా ప్రొద్దుటూరులో వివాహ వేడుక
  • పెళ్లికి హాజరైన పలువురు బిగ్ బాస్-3 కంటెస్టెంట్లు
టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి శ్రావణి రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్లు హాజరయ్యారు. మహేశ్ విట్టా యూట్యూబర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలంలోనే టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో 60 రోజులకు పైగా ఉండి గుర్తింపును తెచ్చుకున్నాడు. చిత్తూరు జిల్లా యాసతో పలు సినిమాల్లో ఆయన ఆకట్టుకున్నాడు. 'కృష్ణార్జున యుద్ధం', 'శమంతకమణి', 'టాక్సీవాలా', 'చలో', 'కొండపొలం', 'అల్లుడు అదుర్స్' తదితర పలు చిత్రాల్లో నటించాడు.
Go Back to Shorts
Mahesh Vitta
Tollywood
Marriage

More Telugu News