కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో, ఎండీ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా
- నాలుగు నెలల ముందే రాజీనామా చేసిన ఉదయ్
- నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కొనసాగనున్న ఉదయ్
- తాత్కాలిక ఎండీగా దీపక్ గుప్తా
పదవీ విరమణకు మరింత గడువు ఉన్నప్పటికీ ఇదే సరైన సమయమని భావించి ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరికల్లా తనతో పాటు చైర్మన్, జాయింట్ ఎండీ రాజీనామా చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో అధికార మార్పిడి సులువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1985లో ఎన్బీఎఫ్‌సీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003 నాటికి దానిని పూర్తిస్థాయి కమర్షియల్ బ్యాంకుగా మార్చారు. మార్కెట్ క్యాప్ పరంగా కోటక్ మహీంద్రా మూడో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు. సీఈవోగా వైదొలిగినప్పటికీ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. ఏదైనా బ్యాంకు సీఈవోగా పదిహేనేళ్లకు మించి ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి.