Bhojpuri Actress: నా సహనటుడు నాపై అత్యాచారం చేశాడు: భోజ్ పురి నటి

Bhojpuri actress accuses co actor reaped her
షార్ట్స్‌లో చూడండి
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన సహ నటుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని భోజ్ పురి చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కెరీర్ ఉన్నతంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా అతడితో తనకు పరిచయం ఏర్పడిందని ఫిర్యాదులో ఆమె తెలిపింది. తొలి నాళ్లలో తనతో ఎంతో మర్యాదగా మెలిగేవాడని, తనకు కూడా సినీ పరిశ్రమలోకి రావాలని ఉందని చెప్పేవాడని పేర్కొంది. 

దీంతో, తనకు తెలిసిన వారితో అతడికి అవకాశాలు వచ్చేందుకు సాయం చేశానని, రోజులు గడిచే కొద్దీ అతడిపై తనకు నమ్మకం ఏర్పడిందని తెలిపింది. ఆ తర్వాత తమ మధ్య ప్రేమ మొదలయిందని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని చెప్పింది. ఒకసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం తాగి వచ్చి, తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తాను హెచ్చరించానని, దీంతో, ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఆ తర్వాత ఆ దిశగా ఏమీ చేయలేదని తెలిపింది. ఇటీవల మరోసారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Bhojpuri Actress
Co Actor
Rape

More Telugu News