లావణ్య త్రిపాఠి నంబర్ ను వరుణ్ తన ఫొన్లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నాడంటే..!
- సుమ అడ్డాలో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పిన వరుణ్
- శుక్రవారం విడుదల కానున్న గాండీవధారి అర్జున
- విదేశాల్లో జరగనున్న వరుణ్–లావణ్య పెళ్లి వేడుక
ఈ షోలో పలువురు లావణ్య గురించి వరుణ్ ను ఆసక్తికర ప్రశ్నలు అగిగారు. లావణ్య నెంబర్ ను తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడు? అని ఒకరు అడిగితే, 'లవ్' అని వరుణ్ చెప్పాడు. లావణ్యనే తన సెల్ ఫోన్ తీసుకొని ఆలా నంబర్ ను సేవ్ చేసిందన్నాడు. లావణ్య త్రిపాఠికి ఇచ్చిన మొట్ట మొదటి గిఫ్ట్ ఏంటో గుర్తుందా? అని అడగ్గా.. చాలా సంవత్సరాలు అయింది కదా గుర్తులేదు అని వరుణ్ సమాధానం ఇచ్చాడు.