Varun Tej: వరుణ్ తేజ్ న్యూ మూవీ టైటిల్ ఖరారు .. రిలీజ్ డేట్ ఇదే!

Operation Valentine release date confirmed
షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాండీవధారి అర్జున' రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన చేస్తున్న సినిమాకి తాజాగా టైటిల్ ను ఖరారు చేశారు. 

సోనీ పిక్చర్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వైమానిక దాడుల నేపథ్యంలో .. భారీ యాక్షన్ దృశ్యాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 

 కెరియర్ పరంగా వరుణ్ తేజ్ కి ఇది 13వ సినిమా. ఇందులో ఆయన IAF ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా 'రాడార్' ఆఫీసర్ పాత్రలో 'మానుషి చిల్లార్' అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కూడా ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు.
Go Back to Shorts
Varun Tej
Manushi Chillar
Shakthi Prathp Singh
Operation Valentine

More Telugu News