పెళ్లి పీటలు ఎక్కనున్న విష్వక్సేన్!
- ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నానంటూ ట్వీట్
- వివరాలు త్వరలో వెల్లడిస్తానన్న యువ నటుడు
- ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో హీరోగా చేస్తున్న విష్వక్
‘ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, మద్దతుకు నా అభిమానులు, శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే’ అని తెలుపుతూ అబ్బాయి, అమ్మాయి కలిసున్న ఎమోజీని ఉంచాడు. దీన్ని బట్టి విష్వక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అర్థం అవుతోంది.