ఆ ఇద్దరితో నటించడంతోనే నా కల నెరవేరింది: తమన్నా

ఆ ఇద్దరితో నటించడంతోనే నా కల నెరవేరింది: తమన్నా

Tamanna talks about chiranjeevi and rajinikanth movies
  • చిరు సరసన భోళా శంకర్‌‌లో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ
  • సూపర్ స్టార్ రజనీకాంత్‌ ‘జైలర్‌‌’లో నటించిన తమన్నా
  • ఈ నెల 10, 11వ తేదీల్లో విడుదల కానున్న చిత్రాలు
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌‌ మొదలై 20 ఏళ్లు కావస్తోంది. అయినా ఆమె జోరు తగ్గడం లేదు. ఇటు తెలుగు, తమిళ్, అటు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వాటిలో చిరంజీవి, రజనీకాంత్ సరసన నటించిన క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ‘భోళా శంకర్’ ఈ నెల 10న విడుదలవనుంది.  రజనీకాంత్‌ హీరోగా వస్తున్న ‘జైలర్’ చిత్రం ఆ తర్వాతి రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలా ఓవైపు మెగాస్టార్, మరోవైపు సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతోనే తన కల నెరవేరిందని తమన్నా చెబుతోంది. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదల కానుండడంతో ఆనందం, ఉద్వేగం రెండూ కలుగుతున్నాయని అంటోంది. ఈ చిత్రాల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 ‘భోళా శంకర్ తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్ అయినా దర్శకుడు మెహర్ రమేష్ చాలా మార్పులు చేశారు. చిరంజీవి గారితో సైరాలో చేసినా అందులో ఆయనతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ఇందులో మాత్రం మిల్కీ బ్యూటీ పేరుతో సాంగ్ చేసే చాన్స్ రావడం నా అదృష్టం. ‘కాళిదాసు’ చిత్రం తర్వాత సుశాంత్‌తో కలిసి నటించినందుకు సంతోషంగా ఉంది. కీర్తి సురేష్ గొప్ప నటి. తనతో కలిసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఇక జైలర్ చిత్రంలో నాది చిన్న పాత్రనే. కానీ, రజనీ సర్‌‌తో కలిసి తెర పంచుకోవడం నా జీవితంలో గుర్తుండిపోయే అనుభవం’ అని తమన్నా చెప్పుకొచ్చింది.
Advertisement
Tamannaah
Chiranjeevi
Rajinikanth

More Telugu News