ప్రభుదేవా 60వ సినిమాగా 'వూల్ఫ్' .. ఉత్కంఠను రేపుతున్న టీజర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుదేవా 60వ సినిమాగా 'వూల్ఫ్' .. ఉత్కంఠను రేపుతున్న టీజర్!

Wolf movie teaser released
  • థ్రిల్లర్ జోనర్లో సాగే కథాకథనాలు 
  • కీలకమైన పాత్రలో అనసూయ 
  • నాలుగు భాషల్లో విడుదల  
ప్రభుదేవా .. రాయ్ లక్ష్మీ .. అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలలో, సందేశ్ నాగరాజు నిర్మాతగా   'వూల్ఫ్' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమాగా ఇది రాబోతోంది. తమిళ .. తెలుగు .. కన్నడ  .. హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 

'వుల్ఫ్' టీజర్‌ను చూస్తుంటే ఇది తాంత్రిక శక్తులపై పరిశోధనలు .. మనుషులను బంధించడం .. బలి .. ఇవ్వడం వంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒక మాయా ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవా సరికొత్త లుక్కులో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇతర ప్రాతాల్లో వశిష్ట ఎన్ సింహా .. అంజు కురియన్ ..  రమేష్ తిలక్  .. దీప .. శ్రీగోపిక .. అవినాష్ .. సుజాత కనిపించనున్నారు.
Advertisement
Prabhudeva
Anasuya
Deepa
Wolf

More Telugu News