'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'సామజవరగమన'
- జూన్ 29న వచ్చిన 'సామజవరగమన'
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో దక్కిన హిట్
- శ్రీవిష్ణుకి అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన సినిమా ఇదే
- ఈ నెల 28వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా'వారు దక్కించుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా పోస్టర్ ను వదిలారు. ప్రేమ - పెళ్లి అనే రెండు అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఫస్టాఫ్ అంతా ప్రేమకి సంబంధించిన కామెడీ .. సెకండాఫ్ అంతా పెళ్లికి సంబంధించిన కామెడీ నడుస్తుంది.
ఫస్టాఫ్ లో నరేశ్ .. సెకండాఫ్ లో వెన్నెల కిశోర్ కామెడీ పరంగా ఈ సినిమాను ఆదుకున్నారు. ఈ ఇద్దరి మధ్య హీరో - హీరోయిన్స్ కి సంబంధించిన లవ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి కూడా ఎక్కువ ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.