తన అనుచరుల శవాలు కూడా మిగలవన్న వార్నింగ్ పై పొంగులేటి స్పందన
- చట్టం మీ చుట్టమా కేసీఆర్ అని ప్రశ్నించిన పొంగులేటి
- తనకు, తను అనుచరులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని వ్యాఖ్య
- బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడమన్న పొంగులేటి
తన అనుచరుల్లో ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని... తన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొంత మంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని... వారంతా గులాబీ షర్టులు వేసుకోవాలని అన్నారు. ఇలాంటి అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాను పోరాడుతానని తెలిపారు.