సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఎందుకు ఆలస్యమవుతోందంటే..!
- పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ గురించి తెలిస్తే కేసు కొలిక్కి
- 2021లోనే టెక్ సంస్థలకు సీబీఐ అధికారిక అభ్యర్థన
- ఈ కేసుకు ముగింపు ఇచ్చేందుకు ఈ వివరాలు ఉపయోగపడవచ్చు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సుశాంత్ మృతి కేసుపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజునే ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం. ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం వాళ్లు వీళ్లు చెప్పిన మాటల ఆధారంగా ఉందని, కానీ ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారని, దీనికి సంబంధించి తాము చర్యలు చేపట్టామని ఫడ్నవీస్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరామని, ప్రాథమిక సాక్ష్యాలు సేకరించామని, ప్రస్తుతం వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. దర్యాఫ్తు కొనసాగుతోందని, ఈ దశలో తాను కేసు గురించి ఏం చెప్పలేనన్నారు.