చంద్రముఖి-2 వచ్చేది ఎప్పుడంటే...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రముఖి-2 వచ్చేది ఎప్పుడంటే...!

Chandramukhi 2 will release on Vinayaka Chavithi
  • గతంలో రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి
  • బ్లాక్ బస్టర్ అయిన చంద్రముఖి.. ఇప్పుడు సీక్వెల్ 
  • చంద్రముఖి-2లో నటిస్తున్న రాఘవ లారెన్స్, కంగనా రనౌత్
  • వినాయకచవితికి రిలీజ్ కానున్న చిత్రం
  • పి.వాసు కెరీర్ లో ఇది 65వ చిత్రం
సీనియర్ దర్శకుడు పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు. 

ఈ సీక్వెల్ కు కూడా పి.వాసునే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వినాయకచవితికి వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. చంద్రముఖి-2లో స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయిక. 

భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 65వ సినిమా ఇది. ఎక్కడా రాజీపడకుండా భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. 

ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ మూవీ హిస్ట‌రీలో ‘చంద్రముఖి’కి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మించేలానే మూవీ ఉంటుంది. వినాయ‌క చ‌వ‌తి సంద‌ర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.
Advertisement
Chandramukhi-2
Vinayaka Chavithi
Raghava Lawrence
Kangana Ranaut
P Vasu
Lyca Productions

More Telugu News