బాలయ్య లైన్లో పెట్టిన నలుగురు దర్శకులు వీరే!
- 'భగవంత్ కేసరి' షూటింగులో బాలయ్య
- ఆ తరువాత సినిమా బాబీ దర్శకత్వంలో
- బోయపాటితో నాలుగో సినిమా చేయడానికి రెడీ
- లైన్లోనే ఉన్న శ్రీవశిష్ఠ .. పరశురామ్
'భగవంత్ కేసరి' తరువాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. ఇది కూడా యాక్షన్ ప్రధానంగా నడిచే కథనే. సితార నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ తరువాత సినిమాను బోయపాటితో చేయనున్నారు. 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, పొలిటికల్ నేపథ్యంలో కొనసాగుతుందని అంటారు.
ఈ సినిమా తరువాత శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. 'బింబిసార'తో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు, బాలయ్య సినిమాను గీతా ఆర్ట్స్ పై చేయనున్నాడు. ఇక ఆ తరువాత సినిమాను పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడని చెబుతున్నారు. ఇలా వరుస సినిమాలతో బాలయ్య యంగ్ హీరోలతో పోటీపడుతుండటం విశేషం.