కోర్టులో లొంగిపోయిన బాలీవుడ్ హీరోయిన్
Add ap7am to your home Screen

కోర్టులో లొంగిపోయిన బాలీవుడ్ హీరోయిన్

Ameesha Patel surrenders before Ranchi civil court
  • చెక్ బౌన్స్ కేసులో ఇబ్బందుల్లో పడ్డ అమీషా పటేల్
  • రూ. 2.5 కోట్లు తీసుకొని తన సినిమాలో నటించలేదని ఓ నిర్మాత ఫిర్యాదు
  • అమీషాకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన రాంచీ సివిల్ కోర్టు
బాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకొని తెలుగులోనూ అనేక సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్‌ ఇబ్బందుల్లో పడింది. కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో సాగుతోంది. నిర్మాత అజయ్‌కుమార్‌ వేసిన ఓ చెక్‌బౌన్స్‌ కేసులో ఆమె రాంచీలోని సివిల్‌ కోర్టులో లొంగిపోయింది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 2.5 కోట్లు పారితోషికం తీసుకొని తమ సినిమాలో నటించలేదని నిర్మాత అజయ్‌కుమార్‌ ఆరోపించారు. అడిగితే డబ్బు తిరిగి చెల్లించలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Advertisement
Ameesha Patel
Bollywood
court
case

More Telugu News