మెగా ఫ్యామిలీకి కండిషన్స్ పెట్టిన లావణ్య త్రిపాఠి?

Lavanya Tripathi conditions for marriage
  • ఇటీవల ఘనంగా జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్
  • స్టేజ్ పై భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదంటూ లావణ్య కండిషన్
  • నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని చెప్పినట్టు సమాచారం
టాలీవుడ్ లో మరో అందమైన జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు తరలి వచ్చారు. మరోవైపు పెళ్లికి ముందే మెగా ఫ్యామిలీకి లావణ్య ఒక కండిషన్ పెట్టిందనే వార్త వైరల్ అవుతోంది. ఆ కండిషన్ కు వరుణ్ తేజ్ ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి లావణ్య ఒప్పుకుందట. 

లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లైన తర్వాత కూడా తనకు స్టేజ్ పైన భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదనే కండిషన్ ఆమె పెట్టిందట. పెళ్లి తర్వాత నటనకైతే దూరంగా ఉంటాను కానీ... ప్రొడక్షన్ వైపు మాత్రం వెళ్తానని చెప్పిందట. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి వరుణ్ తేజ్ తో పాటు, మెగా ఫ్యామిలీ ఒప్పుకుందని చెపుతున్నారు. మరోవైపు వీరి పెళ్లి డిసెంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Advertisement
Lavanya Tripathi
Varun Tej
Marriage
Conditions
Tollywood

More Telugu News