Samudrakhani: 'విమానం' నుంచి అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్!

Vimanam Lyrical Song Released
షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన అనసూయ, వెండితెరపై కూడా ఒక రేంజ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విమానం' రెడీ అవుతోంది. కిరణ్ కొర్రపాటి - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. 
 
ఈ సినిమాలో సుమతి పాత్రలో అనసూయ కనిపించనుంది. ఆమె పాత్రపై సాగే పాట కూడా ఒకటుంది. కొంత సేపటి క్రితం ఆ పాటను రిలీజ్ చేశారు . 'సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత' అంటూ ఈ పాట సాగుతోంది. 

ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించడమే కాదు .. ఆయనే ఆలపించాడు కూడా. సముద్రఖని ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సుమతి పాత్ర హైలైట్ గా నిలుస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
Samudrakhani
Anasuya
Vimanam Movie

More Telugu News