Nallapureddy Prasanna Kumar Reddy: చంద్రబాబును కలవడానికి వెళ్లినప్పుడు నాదెండ్లను ఎందుకు తీసుకెళ్లలేదు?: పవన్ ను ప్రశ్నించిన నల్లపురెడ్డి

YCP MLA Nallapureddy slams Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి, కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తన పార్టీని అమ్ముకున్న పవన్ కచ్చితంగా ప్యాకేజి స్టార్ అని అన్నారు. 

చంద్రబాబుకు పవన్ తన శీలాన్ని అమ్ముకున్నాడని... ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడన్న విషయం పవన్ కు, చంద్రబాబుకే తెలుసని పేర్కొన్నారు. చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన పవన్... నాదెండ్లను ఎందుకు తీసుకెళ్లలేదని నల్లపురెడ్డి ప్రశ్నించారు. జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టింది కేవలం డబ్బు కోసమేనని దీన్ని బట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ ను ప్యాకేజి స్టార్ అంటే చెప్పుతో కొడతానంటున్నాడని... మరి తాను అదే మాట అంటానని, చేతనైతే చెప్పుతో కొట్టాలని నల్లపురెడ్డి సవాల్ విసిరారు. నీకంత దమ్ము, ధైర్యం ఉంటే రా... కోవూరులో నడిరోడ్డులో నిలబడతా అని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందని చెబుతున్నారని, అసలు జనసేన పార్టీ ఇంకా మిగిలుంటే కదా పొత్తు పెట్టుకోవడానికి? అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Nallapureddy Prasanna Kumar Reddy
Pawan Kalyan
YSRCP
Kovur
Janasena

More Telugu News