MS Dhoni: షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న గవాస్కర్

  • ఐపీఎల్ లో నిన్న సీఎస్కే, కేకేఆర్ ల మధ్య మ్యాచ్
  • మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన గవాస్కర్
  • మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ఆటోగ్రాఫ్ అడిగిన సన్నీ
Gavaskar took autograph of Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ ను క్రికెట్ దిగ్గజం గవాస్కర్ తన షర్ట్ పై తీసుకున్నారు. ఐపీఎల్ లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ను కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం తన జట్టు సభ్యులతో కలిసి ధోనీ అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. ఈ మ్యాచ్ కు గవాస్కర్ కామెంటేటర్ గా వ్యవహరించారు. ధోనీ స్టేడియం చుట్టూ తిరుగుతున్న సమయంలో గవాస్కర్ ఆయన వద్దకు వచ్చి షర్ట్ పై ఆటోగ్రాఫ్ చేయాలని అడిగారు. వెంటనే ధోనీ నవ్వుతూ ఆటోగ్రాఫ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత గవాస్కర్ లైవ్ లో మాట్లాడుతూ... తర్వాత మ్యాచ్ ల కోసం తనకు మరో కొత్త పింక్ షర్ట్ ఇవ్వాలని సరదాగా అడిగారు. 

More Telugu News