Kakani Govardhan Reddy: వాళ్లు రైతులు కాదు.. రైతుల వేషాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు: ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్

Kakani Govardhan fires on Chadrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రైతులను అడ్డు పెట్టుకుని అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. అకాల వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు జీవోలను జారీ చేసిందని... ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారని చెప్పారు. 

రైతుల బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని కాకాణి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వచ్చేదని చెప్పారు. రైతులు వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని... అందుకే టీడీపీ కార్యకర్తలతో రైతుల వేషం వేయించి మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Kakani Govardhan Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News