Advertisement

పెళ్లయిన ఐదు నెలలకే విడాకులు.. రాప్ సింగర్ బాద్‌షా రెండో పెళ్లి కూడా పెటాకులు

Badshah and Isha Rikhi divorce five months after marriage
  • పెళ్లయిన ఐదు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించిన రాపర్ బాద్‌షా, ఇషా రిఖీ
  • పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన జంట
  • తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ఊహాగానాలకు తావివ్వొద్దని విజ్ఞప్తి
  • బిగ్ బాస్ 20లో ఇషా రిఖీ పాల్గొంటుందన్న వార్తల నేపథ్యంలో ప్రకటన
  • రాపర్ బాద్‌షాకు ఇది రెండో విడాకులు కావడం గమనార్హం
ప్రముఖ బాలీవుడ్ రాపర్, సింగర్ బాద్‌షా, పంజాబీ నటి ఇషా రిఖీ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. పెళ్లయిన ఐదు నెలలకే తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోతున్నారని జరుగుతున్న ప్రచారానికి తాజాగా ఈ జంట తెరదించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఓ ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది.

"నేను, ఇషా రిఖీ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా దారులు వేరైనా, ఒకరిపై ఒకరికి గౌరవం ఎప్పటికీ ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత జీవితాన్ని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాం. ఈ విషయంపై మా నుంచి ఇదే చివరి ప్రకటన. దయచేసి మా బంధం గురించి ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దు" అని బాద్‌షా తన పోస్టులో పేర్కొన్నారు. ఇదే సందేశాన్ని ఇషా రిఖీ కూడా పంచుకున్నారు.

ఈ ఏడాది మార్చి నెలలో బాద్‌షా, ఇషా రిఖీ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. అయితే, జులై నుంచే వీరి బంధం బీటలు వారిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జులైలో ఇషా రిఖీ ఇన్‌స్టాలో బాద్‌షాతో ఉన్న ఫొటోలు, వీడియోలతో ఒక పోస్ట్ పెట్టి, "ప్రతి తుపాను ఒక పాఠం.. ప్రతి ప్రార్థన ఒక ఆశ" అని క్యాప్షన్ ఇవ్వడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. దానికి హార్ట్‌బ్రేక్ ఎమోజీని కూడా జతచేశారు. అదే సమయంలో ఇషా తల్లి పూనమ్ రిఖీ కూడా 'కర్మ' గురించి కొన్ని పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా రాబోతున్న 'బిగ్ బాస్ 20' సీజన్‌లో ఇషా రిఖీ ఒక కంటెస్టెంట్‌గా పాల్గొనవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నడుమ విడాకుల ప్రకటన రావడం గమనార్హం. కాగా, బాద్‌షాకు ఇది రెండో విడాకులు. గతంలో ఆయన జాస్మిన్ మసిహ్‌ను వివాహం చేసుకున్నారు. 2020లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి 2017లో జన్మించిన జెస్సీమీ గ్రేస్ మసిహ్ సింగ్ అనే కుమార్తె ఉంది.
Advertisement
Badshah
Isha Rikhi
Badshah Divorce News
Badshah Second Marriage
Isha Rikhi Bigg Boss 20
Bollywood Rapper Badshah

More Telugu News