Advertisement

భర్త బలవంతపు మతమార్పిడి.. కాకినాడ ఎస్పీ ఆఫీస్ వద్దే తిరిగి హిందూ మతంలోకి వచ్చిన భార్య

Sirivuri Balaramya returns to Hinduism after husband forced religious conversion at Kakinada SP office
  • భర్త తనను బలవంతంగా మతం మార్చి వేధించాడని మహిళ ఆరోపణ
  • ప్రేమ వివాహం తర్వాత వేధింపులు తీవ్రమయ్యాయని భార్య ఆవేదన
  • మరో ఐదారుగురు మహిళలనూ మతం మార్చాడని ఫిర్యాదు
  • భర్త గౌస్ మొహిద్దీన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రేమ పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ కన్నీటిపర్యంతమై ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయ ఆవరణలోనే ఆమె తన తల్లితో బొట్టు పెట్టించుకుని, తిరిగి హిందూ మతంలోకి వస్తున్నట్లు ప్రకటించడం కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురానికి చెందిన సిరివూరి బాలరమ్య, డిగ్రీ చదువుతున్న రోజుల్లో మటన్ షాపు నడిపే గౌస్ మొహిద్దీన్‌తో ప్రేమలో పడింది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి ఆమె అతడిని వివాహం చేసుకుంది. అయితే, వివాహమైన రెండు నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని, తనను బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేసి షేక్ ఉమల్ ఖైర్‌గా పేరు మార్చాడని ఆమె వాపోయింది.

తమకు కుమార్తె జన్మించిన తర్వాత వేధింపులు మితిమీరాయని, తన సమక్షంలోనే మరో ఐదారుగురు హిందూ యువతులతో సహజీవనం చేస్తూ, వారిని కూడా మతం మార్చాడని ఆమె ఆరోపించారు. దీనిపై నిలదీస్తే.. తనకు ఏడుగురిని వివాహం చేసుకునే అధికారం ఉందని చెబుతూ, కత్తులతో బెదిరించి దాడి చేసేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన సోదరిని కూడా వేధిస్తానని అతడు బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు.

గతంలో ఓ యువతిని కత్తితో గాయపరిచిన కేసులో గౌస్ మొహిద్దీన్‌పై రౌడీషీట్ నమోదైందని, ప్రస్తుతం ఒక ఎస్సీ మహిళను వేధించిన కేసులో అతడు రిమాండ్‌లో ఉన్నాడని బాలరమ్య తెలిపారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌తో కలిసి జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కలిసిన ఆమె, తనకు రక్షణ కల్పించి భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి బలవంతపు మతమార్పిడులపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రామ్‌కుమార్ డిమాండ్ చేశారు.                                
Advertisement
Sirivuri Balaramya
Ghouse Mohiddin
Kakinada forced conversion case
Andhra Pradesh religious conversion news
Kakinada SP office incident
Forced Islam conversion harassment

More Telugu News