Advertisement

ప్రియురాలు బైక్‌పై ఉంటే ఉత్సాహం సహజమే: మద్రాస్ హైకోర్టు

Madras High Court says it is natural for rider to be excited when girlfriend is on bike
  • రోడ్డు ప్రమాదం కేసు విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్య
  • ప్రమాదంలో మరణించిన యువకుడికి 25 శాతం నిర్లక్ష్యం ఉందని నిర్ధారణ
  • ఫలితంగా మృతుడి కుటుంబానికి అందే పరిహారం తగ్గింపు
  • ట్రైబ్యునల్ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు
ఓ రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చుంటే, నడిపే ప్రియుడికి ఉత్సాహం రావడం సహజమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రమాదంలో మరణించిన యువకుడికి పాక్షిక బాధ్యత ఉందని నిర్ధారించింది.

2018 మే 10న తేని జిల్లాకు చెందిన 19 ఏళ్ల గోపాల్, తన ప్రియురాలు రాజేశ్వరితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. వీరపాండి-వాయల్‌పట్టి మార్గంలో అర్ధరాత్రి సమయంలో వారి బైక్‌ను ఓ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేశ్వరి గాయపడ్డారు. దీంతో గోపాల్ తల్లిదండ్రులు పరిహారం కోసం తేని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, 2021లో మృతుడి కుటుంబానికి రూ. 25.5 లక్షలు చెల్లించాలని వ్యాన్ బీమా సంస్థను ఆదేశించింది.

ఈ తీర్పుపై బీమా సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి 25 శాతం పాక్షిక నిర్లక్ష్యం ఉందని కోర్టు తేల్చింది. "మృతుడు 19 ఏళ్ల యువకుడు. అతడి ప్రియురాలు వెనుక కూర్చుని ఉన్నారు. ప్రియురాలు వెనుక కూర్చున్నప్పుడు ఏ రైడర్‌కైనా ఉత్సాహం రావడం సహజం" అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. దీనికి తోడు, మృతుడు రోడ్డుకు కుడివైపున బైక్ నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించకపోవడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ట్రైబ్యునల్ విధించిన పరిహారాన్ని తగ్గించింది.  
Advertisement
Madras High Court
Madurai Bench
Road Accident Compensation
Bike Accident Negligence
Justice GR Swaminathan
Motor Accident Claims Tribunal

More Telugu News