అత్యాచార కేసులో దోషి.. 15 ఏళ్ల తర్వాత భారత సంతతి వ్యక్తి యూఎస్ పౌరసత్వం రద్దు
- అత్యాచారం, కిడ్నాపింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి
- 15 ఏళ్ల తర్వాత అతని అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసిన కోర్టు
- నేరాన్ని దాచిపెట్టి పౌరసత్వం పొందినట్టు తేల్చిన న్యాయస్థానం
- ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్
- పౌరసత్వ పత్రాలను సెప్టెంబర్ 16 లోపు సరెండర్ చేయాలని ఆదేశం
పౌరసత్వం పొందిన 15 ఏళ్ల తర్వాత భారత సంతతి వ్యక్తికి అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికురాలిపై అత్యాచారం, కిడ్నాపింగ్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్ (55) అమెరికా పౌరసత్వాన్ని ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తన నేరాన్ని దాచిపెట్టినందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
భారత్‌కు చెందిన గుర్మీత్ సింగ్ గతంలో న్యూయార్క్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2011 మే నెలలో ఓ యువతి తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు అతడి ట్యాక్సీ ఎక్కింది. మార్గమధ్యంలో ఆమె నిద్రలోకి జారుకోగా, కత్తితో బెదిరించి గుర్మీత్ సింగ్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను బంధించి, కళ్లకు గంతలు కట్టాడు. బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
ఈ దారుణం జరిగిన కొన్ని వారాలకే గుర్మీత్ సింగ్ అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 2011 అక్టోబర్‌లో అతనికి పౌరసత్వం లభించింది. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం, 2014లో అతడిని దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని అమెరికా న్యాయ శాఖ కోర్టును ఆశ్రయించింది.
విచారణ జరిపిన న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు, గుర్మీత్ సింగ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ గత వారం తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 16 లోపు తన పౌరసత్వ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సహా అన్ని పత్రాలను సరెండర్ చేయాలని ఆదేశించింది. "భయంకరమైన నేరాలను దాచిపెట్టి గుర్మీత్ సింగ్ అక్రమంగా అమెరికా పౌరసత్వ హక్కులు పొందాడు" అని న్యాయ శాఖ అధికారులు తెలిపారు. మోసపూరితంగా పొందిన పౌరసత్వం నేరస్థులను కాపాడలేదని వారు స్పష్టం చేశారు.