తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడు.. నాన్నకు బుద్ధి చెప్పరూ!: పోలీసులకు చిన్నారి ఫిర్యాదు
- బాపట్ల జిల్లా ఇస్లాంపేట పోలీస్ స్టేషన్ లో ఘటన
- తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్సై
- ఎస్సై శివయ్యతో బాలుడు మాట్లాడుతున్న వీడియో వైరల్
రహీమ్ తండ్రి సుభాని రైస్ మిల్లులో పనిచేయడంతో పాటు ఇంట్లో మిషన్ కుడతాడు. తల్లి సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. తాగుడుకు బానిసగా మారిన సుభానీ.. రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తూ సుభాంబీని కొడుతున్నాడు. రహీమ్ తో మాట్లాడిన తర్వాత ఎస్సై శివయ్య వెంటనే స్పందించారు. బాలుడి తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా మందలించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ గొడవ పడినా, సుభాంబీని కొట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సుభానిని హెచ్చరించి పంపించారు.