Jagan: రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ విశాఖలో ఫ్లెక్సీలు

Anti Jagan flexes in Vizag
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా విశాఖలో జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జగన్ రేపు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. మరోవైపు రేపటి పర్యటనలో జగన్ భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు మిగులు పనులు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణాలకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఐటీ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Visakhapatnam
Flexes

More Telugu News