భారత్‌లో అమెరికా పెట్టుబడుల దూకుడు.. చైనాను దాటేసిన ఇండియా!
- భారత్‌లో 390 బిలియన్ డాలర్లకు చేరిన అమెరికా పెట్టుబడులు
- భారత స్టాక్స్‌లోనే 380 బిలియన్ డాలర్లు
- చైనాలో అమెరికా 318 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- అమెరికా పెట్టుబడుల్లో భారత్ 12వ స్థానం
- ప్రపంచవ్యాప్తంగా అమెరికా విదేశీ పెట్టుబడులు 19.3 ట్రిలియన్ డాలర్లు
భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ మరింత పెరిగింది. 2025 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.33 లక్షల కోట్లకు సమానం. అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ 383 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాదిలో మరో 7 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే దాదాపు 1.8 శాతం వృద్ధి నమోదైంది. అమెరికా పెట్టుబడులను ఎక్కువగా భారత స్టాక్ మార్కెట్‌లోనే పెట్టింది. 2025 చివరికి భారత ఈక్విటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 380 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024లో ఇది 373 బిలియన్ డాలర్లు.
భారత దీర్ఘకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇవి 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్వల్పకాలిక రుణ పత్రాల్లో పెట్టుబడులు 500 మిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.
ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారుల వద్ద ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్ విలువను మాత్రమే సూచిస్తాయి. కర్మాగారాలు, మౌలిక వసతులు వంటి భౌతిక ఆస్తుల్లో చేసిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఇందులో ఉండవు.
చైనాను వెనక్కి నెట్టిన భారత్
అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్ డాలర్లు కాగా.. చైనాలో 318 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చైనాతో పోలిస్తే భారత్‌లో అమెరికా పెట్టుబడులు 72 బిలియన్ డాలర్లు అధికం. దక్షిణ కొరియాలోని 384 బిలియన్ డాలర్ల కంటే కూడా భారత్ స్వల్పంగా ముందుంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెట్టుబడుల విలువ 2025 చివరికి 19.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2024లో ఇది 15.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వీటిలో 15.25 ట్రిలియన్ డాలర్లు విదేశీ ఈక్విటీల్లోనే ఉన్నాయి.