'రామబాణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రామబాణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

Ramabanam Pre Release Event
  • గోపీచంద్ హీరోగా రూపొందిన 'రామబాణం'
  • సందడిగా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • గోపీచంద్ జెంటిల్ మేన్ అంటూ డింపుల్ కితాబు 
  • ఆయనే అసలైన రామబాణమన్న కోన 
  • మే 5వ తేదీన సినిమా రిలీజ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై 'రామ బాణం' సినిమా నిర్మితమైంది. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ఇది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

సక్సెస్ కి సౌండ్ ఎక్కువ .. 

ఈ వేదికపై కోన వెంకట్ మాట్లాడుతూ .. "ఈ ఆడిటోరియంలో ఉన్న ఎనర్జీని చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనిపిస్తోంది. ఎందుకంటే సక్సెస్ కి సౌండ్ ఎక్కువ. 'రామ బాణం' అంటే అదొక ఆయుధం మాత్రమేకాదు .. అది ఒక గురి. ఈ సినిమాకి సంబంధించి అందరూ కలిసి సంధించిన బాణమే గోపీచంద్. ఆయనలోని నిజాయితీ ఆయన నటనలోను కనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు.

వసూళ్ల వర్షం కురవడం ఖాయం .. 

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ .. "గోపీచంద్ తో నాకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూశాను ... చాలా ప్రామిసింగ్ గా .. ఫ్యామిలీ కథలానే వచ్చింది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురవాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

గోపీచంద్ ను అలా చూస్తుండిపోయాను .. 

డింపుల్ హయతి మాట్లాడుతూ .. 'రామబాణం'లో నాకు మంచి రోల్ దక్కింది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. పంచకట్టులో గోపీచంద్ గారిని అలా చూస్తుండిపోయాను. ఆయనంత జెంటిల్ మేన్ ఎవరూ ఉండరు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" అని అంది.

బాలకృష్ణగారు పెట్టిన టైటిల్ ఇది .. 

గోపీచంద్ మాట్లాడుతూ .. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ .. లక్ష్యం .. లౌక్యం మాదిరిగానే మిమ్మల్ని ఆకట్టుకుంటోంది. మంచి మనసున్న నిర్మాతలు ఈ సినిమాకి దొరకడం అదృష్టం. శ్రీవాస్ ఈ సినిమాను బాగా తీశాడు.ఈ సినిమాకి టైటిల్ పెట్టిన బాలకృష్ణ గారికి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను" అని అన్నారు. 
 
సరైన కొలతలతో చేసిన సినిమా ఇది .. 

శ్రీవాస్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి అంతా పాజిటివ్ పీపుల్ కలిసి పని చేయడం వలన, మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉన్నాయి. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇలా అన్నీ సరైన కొలతలతో చేస్తూ వెళ్లిన సినిమా ఇది. సినిమా ఫస్టు కాపీ చూసిన తరువాత మా నమ్మకం మరింత పెరిగింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Gopichand
Dimple Hayathi
Jagapathi Babu
Ramabanam Movie

More Telugu News