మ‌హేశ్ బాబు చేతుల మీదుగా ‘ప్రేమ విమానం’ టీజర్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌హేశ్ బాబు చేతుల మీదుగా ‘ప్రేమ విమానం’ టీజర్ రిలీజ్!

Prema Vimanam Teaser Released
  • విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన 'ప్రేమ విమానం'
  • సంగీత్ శోభన్ జోడీగా నటించిన శాన్వి మేఘన 
  • సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ 
  • ఆసక్తిని రెకెత్తిస్తున్న టీజర్
'గూఢచారి' .. 'రావణాసుర' వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ - జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను ఈ రోజున సూప‌ర్ స్టార్ మ‌హేశ్ రిలీజ్ చేసి, టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభ‌న్‌, శాన్వి మేఘ‌న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అన‌సూయ‌, వెన్నెల కిషోర్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే... ఓ ప‌ల్లెటూరులోని ఇద్ద‌రు పిల్ల‌లు వారికి ద‌గ్గ‌ర‌గా ఉండే కొండ‌నెక్కి విమానాన్ని చూస్తుంటారు. అందులో ఓ పిల్లాడు మ‌రో పిల్లాడితో ‘అరే మ‌నం కూడా విమానంలో పోదాం రా’ అంటాడు. వారిద్దరూ విమానాన్ని చూడగానే సంతోషపడుతుంటారు. అసలు విమానం అంత ఎత్తు ఎలా ఎగురుతుందనే సందేహం కూడా వారిలో ఉంటుంది. అదొక్కటే కాదు.. విమానానికి సంబంధించి వారికి చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ తీర్చలేక అతని తల ప్రాణం తోక కొస్తుంటుంది. 

మరో వైపు ఓ ప్రేమ జంట (సంగీత్ శోభన్, శాన్వి మేఘన) మధ్యలో మనస్పర్దలు తలెత్తుతాయి. వాటికి కారణం ఏంటి?  వారి ప్రేమ‌ని ఊరు అంగీక‌రిస్తుందా?  విమానానికి వీరి జీవితాల‌కు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఒక వైపు ప్రేమ‌లోని మాధుర్యం, తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే పిల్ల‌ల అమాయ‌క‌త్వం వ‌ల్ల వ‌చ్చే ఫ‌న్‌ ఆకట్టుకోనుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Advertisement
Sangeeth Sobhan
Shanvi Meghana
Prema Vimanam Movie

More Telugu News