Akkineni Akhil: రేపు అఖిల్ సినిమా విడుదల.. తిరుమల వెంకన్నను దర్శించుకున్న నాగార్జున, అమల

  • అఖిల్, సాక్షి వైద్య జంటగా 'ఏజెంట్'
  • ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్
  • రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ అఖిల్
Nagarjuna and Amala in Tirumala

అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా రేపు విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా నెగెటివ్ రోల్ పోషించాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అఖిల్ కూడా ఈ సినిమా తనకు మంచి హిట్ ఇస్తుందనే ఆశల్లో ఉన్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. 

తమ కుమారుడి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈరోజు నాగార్జున, అమల తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.

More Telugu News