Aathmika: టాలీవుడ్ పై కన్నేసిన మరో కోలీవుడ్ బ్యూటీ 'ఆత్మిక' .. లేటెస్ట్ పిక్స్!

  • అందాల సుందరిగా 'ఆత్మిక'
  • కోలీవుడ్ లో కుదురుకుంటున్న బ్యూటీ
  • అక్కడి యూత్ లో మంచి క్రేజ్  
  • టాలీవుడ్ దిశగా అడుగులు 
  • ఇక్కడి అవకాశాలపై దృష్టి 
Aathmika Special

కోలీవుడ్ నుంచి చాలామంది బ్యూటీలు టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అందం .. అందుకు తగిన అభినయం .. అదృష్టం కలిసొచ్చిన చాలామంది ఇక్కడ ఒక రేంజ్ లో చక్రం తిప్పేశారు. అలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్న కథానాయికల జాబితాలో 'ఆత్మిక' ఒకరుగా కనిపిస్తోంది. కోయంబత్తూర్ కి చెందిన 'ఆత్మిక' .. 2017లో తమిళ సినిమాల ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ విజయ్ ఆంటోని .. ఉదయనిధి స్టాలిన్ .. అరుళ్ నిధి .. సందీప్ కిషన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది. ఒక వైపున కోలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున టాలీవుడ్ లోకి అడుగుపెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. పింక్ కలర్ డ్రెస్ లో ఆత్మిక అందంగా మెరుస్తోంది. ఆత్మికను చూడగానే కుర్రాళ్లకు అందాల చందమామ గుర్తుకు రావడం సహజం. చక్కని కనుముక్కుతీరుతో .. అందమైన చిరునవ్వుతో ఆమె తన అభిమానులను చేసుకుంటోంది. పాలరాతి శిల్పంలాంటి ఈ సుందరి, త్వరలోనే తెలుగు ప్రాజెక్టులలో కనిపించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

More Telugu News