వైసీపీకి దూరమయ్యారనే వార్తలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందన
- ఈ వార్తల్లో నిజం లేదన్న ఆర్కే
- నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి సారించానన్న ఎమ్మెల్యే
- టికెట్ ఎవరికి ఇవ్వాలనేది జగన్ నిర్ణయమని వ్యాఖ్య
ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, సీఎం అండతో తాను చేస్తున్న అభివృద్ధి రెండూ కలిసి నియోజకవర్గాన్ని పురోగతి వైపు తీసుకెళ్తున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేశ్ ను ప్రజలు ఓడించారని, ఈసారి కూడా వైసీపీదే గెలుపని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది జగన్ నిర్ణయమని, ఆయన తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఇప్పటికే చెప్పానని అన్నారు.