పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన గోవా బ్యూటీ
- అడ్వెంచర్ మొదలైందంటూ ఇన్ స్టాలో పోస్ట్
- మెడలో ‘మామ’ పెండెంట్ తో మరో ఫొటో..
ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. అయితే, 2019లో వాళ్లు విడిపోయారని ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ తో ఇలియానా ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై ఇలియానా స్పందించలేదు. ప్రస్తుతం కూడా తను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కానీ తండ్రి ఎవరనేది కానీ, పెళ్లి విషయం కానీ చెప్పలేదు. కాగా, తల్లి కాబోతున్నానంటూ ఇలియానా చేసిన పోస్టుకు ఆమె తల్లి సమీరా కూడా కామెంట్ చేశారు. మనవడు/ మనవరాలికి స్వాగతం చెప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నానంటూ డ్యాన్సింగ్ ఎమోజీతో కామెంట్ చేశారు.