NTR: ఎన్టీఆర్ నివాసంలో విందుకు హాజరైన అమెజాన్ స్టూడియోస్ ఉపాధ్యక్షుడు... ఫొటోలు ఇవిగో!

  • గత రాత్రి ఎన్టీఆర్ నివాసంలో ప్రత్యేక విందు
  • హాజరైన జేమ్స్ ఫర్రెల్
  • విందుకు విచ్చేసిన రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల
  • ఫొటోలను పోస్టు చేసిన ఎన్టీఆర్
Amazon Studios Vice President James Farrel attends dinner at NTR residence

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ గత రాత్రి తన నివాసంలో స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి అమెజాన్ స్టూడియోస్ ఉపాధ్యక్షుడు జేమ్స్ ఫర్రెల్ కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ ఇంట జరిగిన ఈ ప్రత్యేక విందుకు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొందరు అగ్రశ్రేణి నిర్మాతలు హాజరయ్యారు. 

కాగా, ఎన్టీఆర్ సన్నిహితుడు రామ్ చరణ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సాయంత్రం వేళ స్నేహితులు, శ్రేయోభిలాషులతో హాయిగా గడిచిపోయిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జేమ్స్, ఎమిలీ ఈ విందుకు హాజరు కావడం సంతోషదాయకమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం విందుకు హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అభిమానులను ఈ ఫొటోలు విశేషంగా అలరిస్తున్నాయి.

More Telugu News