కొడాలి నాని టీడీపీని వాడుకుని మోసం చేశారు: నందమూరి రామకృష్ణ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం నిమ్మకూరు వచ్చిన రామకృష్ణ, సుహాసిని
- ఎవరు ఎవరిని మోసం చేశారో కొడాలి నాని తన ఆత్మసాక్షిని అడగాలని సూచన
- అభివృద్ధిలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శ
అలాగే, ఏపీ పరిస్థితులపై మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. అడుక్కోవడానికి కూడా చిప్ప దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడుతూ.. నిమ్మకూరు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆడపడుచు వచ్చిందని అందరూ గౌరవిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు రామకృష్ణ, టీడీపీ నేతలు నివాళులు అర్పించారు.