ESI: ఈఎస్ఐ ఆసుపత్రులలో ఉద్యోగాలు

ESIC Invites applications recruiting posts in hyderabad district esi hospitals
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్ లింక్ ఇదిగో

ఖాళీలు, కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు..
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ (59), డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (01), ల్యాబ్ టెక్నీషియన్ (11), ఫార్మసిస్ట్ (43).. మొత్తం 114 పోస్టుల భర్తీ
  • పోస్టుల ఆధారంగా అభ్యర్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి
  • 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి
  • ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి
  • చివరి తేదీ 28-03-2023
  • మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
  • జీతభత్యాలు: సీఏఎస్‌, డీఏఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850; ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040
Go Back to Shorts
ESI
esi hospitals
jobs
notification
Hyderabad

More Telugu News