'కాంతార' దర్శకుడితో విజయ్ దేవరకొండ?

Vijay Devarakonda Upcoming Movies Update
  • 'ఖుషీ' సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ 
  • ఆ తరువాత సినిమా గౌతమ్ తిన్ననూరితో 
  • లైన్లో ఉన్న పరశురామ్ - సుకుమార్ 
  • ఈ లోగానే తన ప్రాజెక్టును చక్కబెట్టే పనిలో రిషబ్ శెట్టి
'కాంతార' తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 'కేజీఎఫ్' తరువాత తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సినిమా ఇది. కన్నడ నుంచి ఉపంద్ర .. సుదీప్ వంటి స్టార్ హీరోలు తెలుగు సినిమాల పరంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు తెలుగు హీరోలను వరుసగా లైన్లో పెట్టేస్తున్నారు. 'కాంతార'తో హీరోగా ఇక్కడ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి, అదే ఊపును ఇక్కడ కొనసాగించడానికి రెడీ అవుతున్నాడు. 

రిషబ్ శెట్టికి దర్శకుడిగా మంచి అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేయాలనుందని ఆ మధ్య అల్లు అరవింద్ అన్నారు. త్వరలోనే ఆ మాటను నిజం చేయాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేయాలనే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి .. పరశురామ్ లతో కలిసి పనిచేయనున్నాడు. ఆయనతో కలిసి ఒక సినిమా చేయాలనుందని సుకుమార్ కూడా అన్నాడు. మరి ఈ గ్యాపులో రిషబ్ శెట్టి ఏ వైపు నుంచి ఎంట్రీ ఇస్తాడనేది చూడాలి. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.

Advertisement
Vijay Devarakonda
Rishab Shety
Kantara Movie

More Telugu News