మరింత భారీ బడ్జెట్ తో 'లూసీఫర్ 2'

Lucifer Movie Sequel
  • 2019లో వచ్చిన 'లూసిఫర్'
  • అక్కడ భారీ వసూళ్లను రాబట్టిన సినిమా
  • సీక్వెల్ కి సన్నాహాలు పూర్తి 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగు
  • 6 నెలల సమయాన్ని కేటాయించిన మోహన్ లాల్


మలయాళంలో మోహన్ లాల్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సీనియర్ స్టార్ హీరోగా ఇంత దూరం ప్రయాణం చేసిన మోహన్ లాల్, ఇప్పటికీ కూడా సినిమాకి .. సినిమాకి మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉండటం విశేషం. 2019లో వచ్చిన 'లూసిఫర్' ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది.

అలాంటి సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫస్టు పార్టును తెరకెక్కించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ .. సెకండు పార్టుకి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఆల్రెడీ స్క్రీన్ ప్లేను పూర్తిచేసినట్టుగా ఆయన చెప్పాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా భారీ బడ్జెట్ తో  సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. 

ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర మరింత పవర్ఫుల్ గా కనిపించనుందని సమాచారం. తెరపై ఆయన కనిపించే నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం మోహన్ లాల్ 6 నెలల సమయాన్ని కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాతనే ఆయన మరో సెట్ పైకి వెళతాడని అంటున్నారు. 

Advertisement
Mohanlal
Lucifer

More Telugu News