Sunil: తమిళ సినిమాలతో బిజీ బిజీగా సునీల్!

Sunil Interview
షార్ట్స్‌లో చూడండి
సునీల్ ఇప్పుడు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తెలుగుతో పాటు వరుస తమిళ సినిమాలు చేస్తూ ఆయన ఇంతకుముందు కంటే ఇప్పుడు బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ .. "నాకు తెలిసి సిక్స్ ప్యాక్ చేయడం కంటే నవ్వించడమే కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామెడీ జనాలకు అందుబాటులో ఉంది" అన్నారు. 

"నేను ఇప్పుడు ఫలానా పాత్రలను మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. కొత్తదనం ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగులో శంకర్ - చరణ్ కాంబినేషన్లోని సినిమాలోను, 'పుష్ప 2'లోను .. 'విరూపాక్ష'లోను .. అలాగే కమిటైన సినిమాలు మరికొన్ని ఉన్నాయి" అన్నాడు. 

ఇక తమిళంలో రజనీకాంత్ 'జైలర్' .. కార్తి 'జపాన్' ..  శివకార్తికేయన్ సినిమాలోను .. విశాల్ సినిమాలోను చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన మాటలు నడుస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి" అంటూ చెప్పుకొచ్చాడు.

Go Back to Shorts
Sunil
Actor
Tollywood

More Telugu News